Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146031
            [news_title_telugu_html] => 

వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ కానుకలు

[news_title_telugu] => వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ కానుకలు [news_title_english] => Varadaraja Perumal gets 9.90 Crores income [news_short_description] => కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తి వరదర్‌ ఉత్సవాల సందర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని జిల్లా కలెక్టరు పొన్నయ్య... [news_tags_keywords] => Attivaradarajaswami,Tamilanadu,KanchiPuram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 06:47:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ కానుకలు - Varadaraja Perumal gets 9.90 Crores income - EENADU
close

తాజా వార్తలు

వరదరాజ పెరుమాళ్‌కు రూ. 9.90 కోట్ల హుండీ కానుకలు

హుండీ కానుకలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

కాంచీపురం: కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తి వరదర్‌ ఉత్సవాల సందర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని జిల్లా కలెక్టరు పొన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... ఈ ఆలయంలో జులై ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అత్తి వరదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కానుకలను చెల్లించు కోవడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ తరఫున 18 హుండీలను ఉంచామని తెలిపారు. వీటిల్లో 13 హుండీలలోని కానుకలను మాత్రమే లెక్కించారని వెల్లడించారు. తద్వారా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు చెప్పారు. మిగిలిన హుండీల కానుకలను లెక్కించాల్సి ఉందని తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.