Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146253
            [news_title_telugu_html] => ఏపీ అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై వేటు!
            [news_title_telugu] => ఏపీ అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై వేటు!
            [news_title_english] => Ap Assembly Chief Marshal Transferred
            [news_short_description] => శాసనసభలో ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో శాసనసభ సచివాలయం చీఫ్ మార్షల్ గణేశ్‌బాబుపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. శాసనసభ చీఫ్ మార్షల్ పోస్టు నుంచి..

            [news_tags_keywords] => Ap Assembly,Ap News,Amaravati
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 00:39:46
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఏపీ అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై వేటు! - Ap Assembly Chief Marshal Transferred - EENADU
close

తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై వేటు!

అమరావతి: శాసనసభలో ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో శాసనసభ సచివాలయం చీఫ్ మార్షల్ గణేశ్‌బాబుపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. శాసనసభ చీఫ్ మార్షల్ పోస్టు నుంచి ఆయన్ను తప్పించింది. శాసనసభ చీఫ్ మార్షల్‌గా గణేశ్‌బాబు సేవలను ఉపసంహరిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. గణేశ్‌బాబును ఆయన మాతృశాఖ ఆక్టోపస్‌కు తిరిగి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో డీజీపీ పేర్కొన్నారు. గణేశ్‌ను మంగళగిరిలోని ఆక్టోపస్ ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆదేశాల్లో తెలపడంతో ఆయన అక్కడ రిపోర్టు చేశారు. 
ఆక్టోపస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ఉన్న గణేష్.. చాలా కాలంగా శాసన సభ సచివాలయ చీఫ్ మార్షల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఫర్నీచర్‌ తరలింపు వ్యవహారంపై ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాం డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై గత కొద్ది రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గణేశ్‌బాబు పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.