close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఇక పాలమూరు పరుగు 

నిధులు, భూసేకరణ తదితర సమస్యలతో మందకొడిగా సాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, గురువారం స్వయంగా పనులను పరిశీలించనున్నారు. రిజర్వాయర్ల నిర్మాణం, లిఫ్టు పనులను పరిశీలించిన అనంతరం అక్కడే సమీక్ష చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నాలుగేళ్ల పిల్లలూ హెల్మెట్‌ ధరించాల్సిందే 

‘మోటారు వాహనాల సవరణ చట్టం-2019’లోని 28 నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మిగతా సెక్షన్లకు సంబంధించి ముసాయిదా నిబంధనలను రూపొందించి, అభిప్రాయ సేకరణ తర్వాత వాటిని అమలు చేస్తామంది. తొలుత రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు. ఇకపై ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్‌ ధరించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఐటీ పోటు తగ్గించండి 

మధ్యతరగతిపై విధించే వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గించాలని ప్రత్యక్ష పన్నుల స్మృతి (డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌ -డీటీసీ) రూపకల్పనపై ఏర్పాటయిన కార్యాచరణ బృందం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అఖిలేశ్‌ రంజన్‌ నేతృత్వంలో ఏర్పాటయిన ఈ బృందం గత నెలలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తుది నివేదికను అందజేసింది. మధ్యతరగతి వర్గం ప్రజలు మరింతగా ఖర్చు పెట్టడం కోసం వారి చేతిలో సొమ్ము ఉండాలని, అందుకుగానూ పన్నుల భారం తగ్గించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పోలవరం టెండర్లలో జాప్యం

పోలవరం ప్రధాన డ్యాం పనులకు సంబంధించి ఇంకా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆ టెండర్‌ షెడ్యూల్‌ ఆన్‌లైన్‌లో ఇంకా అప్‌లోడ్‌ కాలేదు. సాంకేతిక సమస్యల వల్లనే టెండర్‌ ఇంకా ఆన్‌లైన్‌లో ఉంచలేకపోయామని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జలవిద్యుత్తు కేంద్రం పనుల అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటమూ మరో కారణంగా తెలుస్తోంది. పోలవరం డ్యాం పనులు, జలవిద్యుత్తు కేంద్రం పనులు కలిపి మొత్తం రూ.4987.55 కోట్ల అంచనా విలువతో టెండర్లు ఆహ్వానించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కొత్తగా 75 ప్రభుత్వ వైద్య కళాశాలలు

వైద్యుల కొరత తీర్చేందుకు దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో కొత్తగా 75 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని బుధవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల మూడో దశలో భాగంగా వీటిని జిల్లా స్థాయి, రిఫరల్‌ ఆసుపత్రులకు అనుబంధంగా ఏర్పాటు చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఏర్పాటు కోసం 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. విద్యుత్‌ సంస్థల్లో 3195 కొలువులు

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కిందిస్థాయి ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల పరిధిలో 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి అతి త్వరలో ప్రకటనలు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయ వివాదాలు రాకుండా ఉండేందుకు కొన్ని అంశాలపై న్యాయ సలహాలను దక్షిణ డిస్కం అడిగింది. న్యాయ విభాగం నుంచి సమాధానం వచ్చిన తరవాత ప్రకటన జారీచేయనున్నారు. దక్షిణ డిస్కంలో రెండు వేల జూనియర్‌ లైన్‌మెన్‌, మరో 500 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. దేశంలోకెల్లా అతిపెద్ద తెర

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో దేశంలో అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌ గురువారం ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వారు చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెంలో రూ.40 కోట్లతో సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌ థియేటర్‌ నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి గురువారం సినీనటుడు రామ్‌చరణ్‌ రానున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గగన్‌యాన్‌లో మహిళలు ఉండకపోవచ్చు

భారత అంతరిక్ష చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యోమగాముల్లో ఓ మహిళ కూడా ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి అవకాశమేదీ లేదని తాజాగా ఇస్రో సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గగన్‌యాన్‌లో మహిళలెవరూ ఉండకపోవచ్చని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దేశ భద్రతే ప్రధాన అంశం: అమిత్‌షా

దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దేశ భద్రత అనేది ప్రధాన అంశమని కేంద్ర హోంమత్రి అమిత్‌ షా వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన బ్యూరో పోలీస్ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్‌డీ) 49వ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఆ కల సాకారం కావాలంటే దేశ భద్రత అనేది ముఖ్యమైన అంశం’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై అక్టోబరు 2 నుంచి నిషేధం

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు, ప్యాకెట్లు తదితరాలపై కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 2 నుంచి నిషేధం విధించనుంది. ఇలాంటి ఉత్పత్తుల తయారీ, దిగుమతి, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.