close

తాజా వార్తలు

మెట్రో రైలులో స్వల్ప ప్రమాదం

ఊడిపడిన డోర్‌ క్యాబిన్‌, తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రో రైలులో శుక్రవారం స్వల్ప ప్రమాదం సంభవించింది. రైలులో డోర్‌పై ఉన్న క్యాబిన్‌ ఊడి  ప్రయాణికులపై పడింది. దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు, మెట్రో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అందజేసిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్‌ అండ్‌ టీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.