close

తాజా వార్తలు

చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురి మృతి

బిక్కనూరు:  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌వైపు వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ సహా నలుగురు మృతి చెందారు. మృతులను నిజామాబాద్‌ జిల్లా కోటగల్లీలోని పద్మానగర్‌కు చెందిన లావణ్య(35), రోష్ని(17)తోపాటు నవీపేటకు చెందిన ప్రశాంత్‌(18), సుశీల్‌(20)గా గుర్తించారు. తమ బంధువైన అరుణ్‌ అనే వ్యక్తిని శంషాబాద్‌ విమానాశ్రయంలో దింపి వెనుదిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు గ్యాస్‌ కట్టర్‌తో కారు భాగాలను తొలగించి మృత దేహాలను బయటకు తీశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.