close

తాజా వార్తలు

అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి సమీక్ష

దిల్లీ : దేశ అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష సమావేశం నిర్వహించారు. నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ అత్యున్నతస్థాయి సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుగా వరుసగా రెండోసారి నియమితులైన అజిత్‌ డోభాల్‌ హాజరయ్యారు. కేంద్రప్రభుత్వం ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్‌ 1న కేంద్ర హోంమంత్రిగా అమిత్‌ షా బాధ్యతలు స్వీకరించిన తరువాత అంతర్గత భద్రతపై జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదం, నక్సలిజంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికలకు ముందు భాజపా మేనిఫెస్టోలో కశ్మీర్‌ అంశానికి అత్యంత ప్రాధాన్యం కల్పించింది. ఆ రాష్ట్రంలో అమలవుతోన్న ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల ఏరివేతపై కూడా కొత్త ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.