close

తాజా వార్తలు

మోదీ విమానానికి పాక్‌ నో

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ వస్తున్న పాక్‌.. మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విమానాన్ని తమ గగనతలం నుంచి అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి వెల్లడించారు. ఈ మేరకు భారత హై కమిషన్‌కు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.

వారం రోజుల అమెరికా పర్యటన నిమిత్తం సెప్టెంబర్‌ 21న ప్రధాని మోదీ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతించాలని భారత్‌ ఆ దేశాన్ని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పాక్‌ అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు దేశాల పర్యటన సందర్భంలో కూడా పాక్‌ అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు పాక్‌ గగనతలాన్ని మూసివేసినప్పటికీ మళ్లీ పునరుద్ధరించింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.