close

తాజా వార్తలు

మూకదాడులతో దేశ ప్రతిష్ఠను దిగజార్చొద్దు

నాగ్‌పూర్‌: మూకదాడులు పాశ్చాత్య సంస్కృతి అని..వీటితో దేశ ప్రతిష్ఠ దిగజార్చొద్దని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కోరారు. అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. నాగ్‌పూర్‌లో దసరా సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో చోటుచేసుకుంటున్న మూకదాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూకదాడులు పరాయి సంస్కృతి నుంచి వచ్చిందని.. అది భారతీయుల ఆచారాలకు పూర్తిగా విరుద్ధమని గుర్తుచేశారు. ప్రతి పౌరుడు శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. భిన్నత్వం దేశ అంతర్గత శక్తికి నిదర్శనమన్నారు.  

ఈ మధ్య కాలంలో భారతీయత అనే సిద్ధాంతంపై ప్రజల ఆలోచనా ధోరణిలో సానుకూలత పెరుగుతోందని భగవత్‌ అభిప్రాయపడ్డారు. కానీ, దీన్ని కొన్ని స్వార్థ శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. పటిష్ఠ భారతదేశ నిర్మాణం కోసం తీసుకున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. అలాంటి శక్తుల్ని గుర్తించి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడి నుంచో అరువు తెచ్చుకుంది కాదని.. భారత్‌లో అది శతాబ్దాలుగా అనుసరిస్తున్నామని చెప్పుకొచ్చారు. 

గతంతో పోలిస్తే భారత సరిహద్దులు ప్రస్తుతం పటిష్ఠంగా ఉన్నాయని భగవత్‌ అన్నారు. తీర ప్రాంతాల రక్షణపై మరింత నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను సైతం త్వరలో అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అంతకుముందు ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆయుధపూజలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎల్‌ సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, నితిన్‌ గడ్కరీ, జనరల్‌ వి.కె.సింగ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.