
తాజా వార్తలు
న్యూదిల్లీ: అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. ట్రస్ట్ ఏర్పాటు కంటే ముందు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఒకటి ఏర్పాటైంది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో తీర్పును పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఆ బృందం నిమగ్నమై ఉందని ఓ అధికారి తెలిపారు. అలాగే ట్రస్ట్ ఏర్పాటుకు అవలంబించాల్సిన పద్ధతులపై న్యాయశాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, అయితే ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఓ అధికారి వెల్లడించారు. కొత్తగా ఏర్పడే ఈ ట్రస్ట్‌కు నోడల్ వ్యవస్థగా కేంద్ర హోంశాఖ ఉంటుందా? లేఖ సాంస్కృతిక శాఖ ఉంటుందా? అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదని మరో అధికారి చెప్పారు.
మొత్తం 2.77 ఎకరాలకు సంబంధించిన వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడిన ఓ ట్రస్ట్ గానీ, వేరే ఇతర బాడీని గానీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని కేంద్రానికి సూచించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
