
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: గగన్‌యాన్ శిక్షణ కోసం తొలుత భారత్ షార్ట్ లిస్ట్ చేసిన 60 మంది పైలట్లలో 12 మంది దంత సమస్యల కారణంగా ఇంటిదారి పట్టినట్లు తెలిసింది. చాలా మంది భారత పైలట్లకు రష్యా శిక్షణకు నిరాకరించడానికి దంత సమస్యలే ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ విషయాన్ని ఐఏఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణులు చెప్పారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఫ్రెటర్నిటీ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ 1982-84 తర్వాత మళ్లీ ఇప్పుడు వ్యోమగాములను ఎంపిక ప్రక్రియను చేపట్టింది.
దంత సమస్యలకు అంతప్రాధాన్యం దేనికీ..?
దంత సమస్యలు అంతరిక్షంలో వ్యోమగాములకు చాలా సమస్యలను సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో భారతీయ పైలట్లను ఎంపిక చేసేటప్పుడే ఎటువంటి దంత సమస్యలు ఉండకూడదని రష్యా నిపుణులు కచ్చితంగా చెప్పారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ విషయంలో కఠినంగా ఉంటుంది. అక్కడి వ్యోమగాములు దంతాల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు.
వ్యోమనౌక గాల్లోకి ఎగిరేసమయంలో తీవ్రమైన ఒత్తిడి, ప్రకంపనలను ఎదుర్కొంటారు. దీంతో ఆ సమయంలో సరిగాలేని దంతాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. దీంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లాక శరీరంపై ఒత్తిడి కూడా మారుతుంది. దీంతో పుచ్చుపళ్లు ఉంటే తీవ్ర నొప్పిని పుట్టిస్తాయి. 1978లో సెల్యూట్-6 మిషిన్ కమాండర్ యూరీ రోమినికో ఈ సమస్యతో తొలిసారి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దంత సమస్యలతో పాటు వినికిడి, దృష్టిలోపాలను కూడా వ్యోమగాముల ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
గగన్‌యాన్‌కు సంబంధించి రష్యా సహకారాన్ని భారత్ తీసుకుంటోంది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగాములకు ఆ దేశం శిక్షణ ఇస్తోంది. యూరీ గగారిన్ కాస్మోనాట్ సెంటర్లో శిక్షణ మొదలైంది. ఇప్పటికే ఏడుగురు శిక్షణ పూర్తి చేసుకొన్నారు. వీరు భారత్‌కు చేరుకున్నారు. వీరికి తుది శిక్షణ ఇంకా ఇవ్వాల్సి ఉంది. తాజాగా మరో 36 మందిని శిక్షణ నిమిత్తం ఐఏఎఫ్ ఎంపిక చేసింది. వీరిలో కూడా అతికొద్ది మందే తుదిశిక్షణకు ఎంపిక కానున్నారు. తుది శిక్షణకు మొత్తం 12మందిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. దీనిని కూడా పూర్తి చేసుకొంటే వీరిలో ముగ్గురిని 2022లో గగన్‌యాన్ పాజెక్టుకు ఎంపిక చేస్తారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
