
తాజా వార్తలు
చెన్నై: తమిళనాడులోని చెన్నై నుంచి జపాన్ రాజధాని టోక్యోకు నేరుగా కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్ దేశ ఎయిర్‌లైన్స్ ‘ఆల్ నిప్పన్ ఎయిర్వేస్’ పేర్కొంది. చెన్నై నుంచి టోక్యోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీస్‌ను సంస్థ ప్రారంభించింది. తమిళనాడులోని పారిశ్రామిక కాంప్లెక్స్ ప్రాంతానికి జపాన్ కంపెనీలతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు నగరాల మధ్య విమాన సర్వీసును జపాన్ కొత్తగా ప్రారంభించింది. ఈ సర్వీసుతో టోక్యో నగరాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇరుదేశాల మధ్య పర్యాటక, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ సంస్థ ప్రతినిధి యసుయూకి తొమిట్సు చెప్పారు. భారత్ నుంచి జపాన్‌కు నేరుగా నడిచే విమానాల్లో ఇది మూడోది. ఇప్పటికే ముంబై, దిల్లీల నుంచి జపాన్‌కు విమానాలు నడుస్తున్నాయి.