close

తాజా వార్తలు

ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్

ముంబయి: సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరాల్సిన రకుల్‌.. విమానాలు రద్దవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ‘ముంబయి ఎయిర్‌పోర్ట్‌ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?’ అంటూ బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు రకుల్‌ స్పందిస్తూ.. ‘సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా ఎయిర్‌పోర్ట్‌ నుంచి కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయాను’ అని సమాధానమిచ్చారు. భారీ వర్షాల కారణంగా అనేక విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ నెల ఐదో తేదీ వరకు ముంబయిలో అతిభారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.