close

తాజా వార్తలు

అవినీతి నిరూపించి ‘రివర్స్‌’కు వెళ్లాల్సింది

కొవ్వూరు (ప.గో.): పోలవరం ప్రాజెక్టులో అవినీతిని నిరూపించి రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే బాగుండేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగు నెలలైనా అవినీతి ఎక్కడ జరిగిందో  కనిపెట్టలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ఈ నెల 13న కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవబోతున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతి, అవినీతి ఆరోపణల గురించి మంత్రికి వివరిస్తామని చెప్పారు. ఈ మేరకు కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు బయల్దేరారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు మాణిక్యాలరావు, అంబికా కృష్ణ కలిసి పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను పరిశీలించనున్నారు. పర్యటన వివరాలను కేంద్రమంత్రికి అందజేయనున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.