close

తాజా వార్తలు

హరియాణాలో భాజపా మేనిఫెస్టో విడుదల

చండీగఢ్‌: హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆదివారం విడుదల చేసింది. ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవిష్కరించారు. సంక్షేమ, ప్రజాకర్షక హామీల వర్షం కురిపించారు. యువతను, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా మేనిఫెస్టోను తయారు చేసినట్లు నడ్డా తెలిపారు.
మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
‘హరియాణా కలల ప్రణాళిక’అనే శీర్షికతో ఉన్న ఈ మేనిఫెస్టోలో రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు.
25లక్షల మంది యువతకు ఉద్యోగాల సాధన కోసం ఉచిత శిక్షణ. దీని వల్ల ప్రభుత్వంపై రూ.500 కోట్ల భారం పడుతుంది.  పరిశ్రమల్లో 95% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా నిబంధనలు తీసుకురావడం వంటి అంశాలను చేర్చారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.