
తాజా వార్తలు
ముంబయి: భాజపా తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే మహారాష్ట్రలో పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు దారితీశాయంటూ శివసేన విమర్శించింది. ఎన్నికల సందర్భంగా శివసేనకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చేవి కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు బుధవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించారు. ‘‘ఇరు పార్టీలకు కలిపి ప్రజలు మద్దతు తెలిపారు. ఇరుపార్టీలు కలిసి రూపొందించిన విధానాలకే ప్రజలు ఓటేశారు. కానీ, భాజపా దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మరాఠీల గౌరవాన్ని కాపాడడానికే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దానికి మమ్మల్ని నిందించడం ఎందుకు? భాజపా విలువలకు కట్టుబడిన పార్టీగా చెబుతుంటారు. మరి మహారాష్ట్ర విషయంలోనూ అదే విలువల్ని పాటించాల్సింది. ఒకవేళ ఇచ్చిన మాటని భాజపా నిలబెట్టుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ భాజపాపై తీవ్ర విమర్శలు చేసింది.
తమ పార్టీపై ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలపడానికి కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. ఈ సందర్భంగా గవర్నర్ భగత్ కోశ్యారీపైనా విమర్శలను ఎక్కుపెట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టుకునేందుకు తమకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించింది. ఆ సమయంలో అనేక మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని గవర్నర్ ఇచ్చిన 24గంటల సమయం వారి సంతకాలు సేకరించడానికి కూడా సరిపోదని వాదించింది. గవర్నర్ ఇలా వ్యవహరించడం పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో భాజపా జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అక్కడ కూడా ఆ పార్టీతో విభేదించి రాష్ట్రపతి పాలన విధించారని ఆరోపించింది.
మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం లేదని పేర్కొంటూ గవర్నర్ పంపిన నివేదిక మేరకు కేంద్ర కేబినెట్ సమావేశమై రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సూచిస్తూ దస్త్రాన్ని మంగళవారం రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దానికి ఆమోదం తెలిపారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. శివసేనకు మద్దతిచ్చే అంశంపై నిర్ణయం వెలువరించకుండా సోమవారం జాప్యం చేసిన కాంగ్రెస్‌పార్టీ.. మంగళవారం మధ్యాహ్నం వరకూ అదే పంథా కొనసాగించింది. చర్చలకు సీనియర్ నేతలను ముంబయి పంపింది. అదేసమయంలో గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపడం.. రాష్ట్రపతి పాలన విధించడం జరిగిపోయాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
