close
హ్యూస్టన్‌లో ‘నమో తాలి’..!

‘నమో తాలి’ సిద్ధం చేసిన చెఫ్‌

హ్యూస్టన్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అక్కడి ఎన్‌ఆర్జీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీద అభిమానంతో హ్యూస్టన్‌లోని ఒక చెఫ్‌, ప్రవాస భారతీయురాలు కిరణ్‌ వర్మ ‘నమో తాలి’ పేరుతో భోజనాన్ని తయారు చేశారు. ఇందులో ‘నమో తాలి మిఠాయి’, ‘నమో తాలి సూరి’ రెండు రకాలున్నాయి. ఈ వంటలన్నీ భారత్‌లో లభించే నేతి రుచులే. అంతేకాకుండా ప్రధాని మోదీ భోజన మెనూలో వివిధ రకాళ పచ్చళ్లు కూడా ఉండనున్నాయి.  నమో తాలి మిఠాయిలో ష్రిఖండ్‌, రసమలై, క్యారట్‌ హల్వా, బాదం హల్వా ఉంటాయి. నమో తాలి సూరిలో కిచిడీ, కచోరి, మేతి తెప్లా ఉన్నాయి. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం చెందిన వంటలను ప్రధాని మోదీ మెనూలో చేర్చినట్లు కిరణ్ వర్మ తెలిపారు. ప్రధాని మోదీకి ఇలా ఆహార పదార్థాలు చేయడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు.  


 


వార్తలు / కథనాలు

మరిన్ని