close
నాట్స్‌ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

సెయింట్ లూయిస్: అమెరికాలోని తెలుగు వారిని ఒక్కటి చేసే దిశగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆ సంఘం సభ్యులు తెలిపారు. అందులో భాగంగా మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు సెప్టెంబర్‌ 21న కొలంబస్ నాట్స్ సెంట్రల్ ఓహియో విభాగం అక్కడి తెలుగు మహిళలకు వాలీబాల్‌, త్రోబాల్‌ టోర్నీలు నిర్వహించారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉంటున్న ఎంతో మంది తెలుగు వారు ఈ టోర్నీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డెట్రాయిట్‌, కొలంబస్‌ జట్ల మధ్య జరిగిన త్రోబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠ సాగింది. ఈ మ్యాచ్‌లో డెట్రాయిట్‌ జట్టు విజయం సాధించింది. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేసినట్లు నాట్స్‌ సభ్యులు వెల్లడించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని