close
వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగీత విభావరి

న్యూజెర్సీ: అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో వేగేశ్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘంటసాల 12వ ఆరాధనోత్సవాలు, బాలు 9వ సంగీతోత్సవాలు(శిరోమణి) శనివారం ఘనంగా జరిగాయి. వికలాంగుల నిర్వహణ ఖర్చుల నిమిత్తం విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఈ సంగీత విభావరి కార్యక్రమానికి శ్రోతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక తెలుగు సంస్థలు తెలుగు కళా సమితి న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్‌ల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో రాధా కాశీనాథుని వ్యాఖ్యాతగా వ్యవహరించగా,  మూర్తి భావరాజు, బండారు రాజారావు, ప్రభా రఘునాధ్ సహాయ సహకారాలను అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ‘అపర ఘంటసాల’ తాతా బాలకామేశ్వరరావుతో పాటు పలువురు స్థానిక కళాకారులు వంశీప్రియ, శ్రీకర్, కృష్ణ, అంజని నందిభొట్ల, అంజలి చెన్నాప్రగడ, రవి కామరసులు అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. దివ్యాంగులు, అనాధలకు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వంశీ రామరాజు చేస్తున్న సేవలను రవి కొండబాల, మంజు భార్గవ, ఉషా రావిళ్ళ తదితరులు అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చి సహాయపడవల్సిందిగా వారు అభ్యర్థించారు. 

ఈ సందర్భంగా శ్రీ వంశీ రామరాజు మాట్లాడుతూ.. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా గత 32 సంవత్సరాలలో వేలాది బీద దివ్యాంగ బాలల్ని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దామన్నారు. ప్రస్తుతం సుమారు 500 మంది  అనాథ వికలాంగులకు జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కల్పిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమానికి హాజరై విరాళాలు ఇచ్చి ప్రోత్సహించిన దాతలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు కళా సమితి తరపున సుధాకర్ ఉప్పాల, మధు రాచకుళ్ళ, రేణు తాడేపల్లి, జ్యోతి గండి, న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్‌ తరపున మంజు భార్గవ, క్రిష్ణవేణి, ఉషా రావిళ్ళ తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించినట్లు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని