close
గాంధీ జయంతి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఇర్వింగ్‌ : మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న ఇర్వింగ్‌లోని గాంధీ మెమోరియల్ ప్లాజాలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక ఏర్పాట్లపై మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా సురేంద్ర అదానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో నిర్వహించనున్న ‘గాంధీ శాంతి యాత్ర’కు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి భోజన సదుపాయంతో పాటు, నార్త్ లేఖ్ కాలేజ్ నుంచి గాంధీ మెమోరియల్ వరకూ ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు ప్రసాద్ తోటకూర, బి.ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పీయూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్, అభిజిత్ రాయల్కర్, ఆహ్వాన కమిటీ సభ్యులు మురళి వెన్నం, రన్నా జానీ, ఆనంద్ దాసరి, డా.సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్‌ తదితరులు పర్యవేక్షించారు. మరిన్ని వివరాల కోసం www.mgmnt.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. 

 

వార్తలు / కథనాలు

మరిన్ని