Elections: తెలుగు రాష్ట్రాల్లో నేతల ప్రచార ‘సిత్రాలు’

 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, అధినేతలు నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.

Updated : 08 May 2024 12:44 IST
1/23
కుప్పంలోని పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా నాయకులు. కుప్పంలోని పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా నాయకులు.
2/23
విజయనగరం యువగళం సభలో మాట్లాడుతున్న లోకేశ్‌. వేదికపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, అసెంబ్లీ అభ్యర్థి అదితి గజపతిరాజు, లోక్‌సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం యువగళం సభలో మాట్లాడుతున్న లోకేశ్‌. వేదికపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, అసెంబ్లీ అభ్యర్థి అదితి గజపతిరాజు, లోక్‌సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు.
3/23
తిరుపతి సభలో అభిమానులు ఇచ్చిన గదతో చంద్రబాబు, కరవాలంతో పవన్‌కల్యాణ్‌. చిత్రంలో చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థులు పులివర్తి నాని, శ్రీనివాసులు, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి వరప్రసాదరావు తదితరులు. తిరుపతి సభలో అభిమానులు ఇచ్చిన గదతో చంద్రబాబు, కరవాలంతో పవన్‌కల్యాణ్‌. చిత్రంలో చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థులు పులివర్తి నాని, శ్రీనివాసులు, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి వరప్రసాదరావు తదితరులు.
4/23
కమలాపురం వద్ద ఉపాధి కూలీలతో కలిసి  మట్టి తవ్వుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కమలాపురం వద్ద ఉపాధి కూలీలతో కలిసి మట్టి తవ్వుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.
5/23
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఈనెల 5వ తేదీ రాత్రి పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన సమయంలో  గాయపడిన నల్లల శ్రీధర్‌ను పరామర్శిస్తున్న హీరో సాయిధరమ్‌తేజ్‌. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఈనెల 5వ తేదీ రాత్రి పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన సమయంలో గాయపడిన నల్లల శ్రీధర్‌ను పరామర్శిస్తున్న హీరో సాయిధరమ్‌తేజ్‌.
6/23
హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా సురేఖ, కడియం కావ్య, సీతక్క, రాజేందర్‌రెడ్డి తదితరులు. హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా సురేఖ, కడియం కావ్య, సీతక్క, రాజేందర్‌రెడ్డి తదితరులు.
7/23
బేగంబజార్‌ రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ. పక్కన హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలత.
 
8/23
మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో అభ్యర్థి వెంకట్రామిరెడ్డి.

9/23
ఖమ్మం నగరంలో రోడ్‌షోలో అభివాదం చేస్తున్న సినీనటుడు వెంకటేశ్‌. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, తుమ్మల యుగంధర్‌ తదితరులు.
 
10/23
నల్లకుంట రోడ్‌ షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో కాలేరు వెంకటేశ్, పద్మారావు తదితరులు.

11/23
కారు గుర్తుకు ఓటు వేసి భారాస అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరుతూ ధన్నూర్‌లో వడియాలు పోస్తున్న ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌.

12/23
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో దోసెలు వేస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌. 

13/23
మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కీసరలో వర్షంలోనూ ప్రచారం కొనసాగించారు.     

14/23
మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి, మధుయాస్కీ గౌడ్‌.. కొత్తపేట రాజీవ్‌గాంధీ నగర్‌లో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. అభివాదం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

15/23
సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు సీతారాంబాగ్, ఆగాపుర, బోయిగూడ కమాన్‌ ప్రాంతాల్లో ప్రచారాల్లో పాల్గొన్నారు.
 
16/23
మాజీ గవర్నర్‌ తమిళిసై బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ ఓటర్లకు రామ మందిర నమూనాలను కానుకగా అందించారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

17/23
హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పాదయాత్రలపై ప్రధానంగా దృష్టి సారించారు. గోషామహల్‌ ప్రాంతంలోని సిద్ధంబర్‌ బజార్, భగవాన్‌గంజ్, మచ్చీపురలో ప్రచారం చేశారు.

18/23
కంటోన్మెంట్‌ అసెంబ్లీ భాజపా అభ్యర్థి వంశతిలక్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్‌ నేతలు ఏడో వార్డు చిన్న కమేలా, సాయిబాబా హట్స్‌ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇల్లిల్లూ తిరిగి ఓటర్లకు పాదాభివందనం చేశారు.

19/23
కంటోన్మెంట్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ మూడో వార్డు బాలంరాయి బస్తీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారంలో వృద్ధులకు దండాలు పెడుతూ తనను గెలిపించాలని అభ్యర్థించారు.
 
20/23
కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ.

21/23
భువనగిరి పట్టణంలో నేతన్నకు భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు.  

22/23
ముశిపట్లలో అరుగు మీద కూర్చొని నమూనా ఈవీఎం యంత్రంపై ఓటు ఎవరికి  వేస్తావో చూపెట్టమని వృద్ధురాలిని కోరుతున్న ఎమ్మెల్యే మందుల సామేల్‌.

23/23
ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద ఓ చిన్నారికి స్వయంగా  పకోడి తినిపిస్తున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్‌.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు