close

భాజపాను గద్దె దింపగలగాలి!

మమ్మల్ని పక్కన పెట్టినా ఫర్వాలేదు: రాహుల్‌గాంధీ

దుబాయ్‌: లోక్‌సభ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. భాజపాను గద్దె దింపడంలో కూటమి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నంలో తమ పార్టీని కూటమి పక్కనపెట్టినా తనకు అసంతృప్తిగా లేదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తాము పూర్తి శక్తి-సామర్థ్యాలతో ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేస్తామన్నారు. అఖిలేష్‌, మాయావతిలపై తనకు అపార గౌరవం ఉందని, వారికి సంబంధించినంత వరకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు వారికుందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.


 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.