రైతుల దేశవ్యాప్త నిరసనకు 12 పార్టీల మద్దతు

తాజా వార్తలు

Updated : 24/05/2021 06:02 IST

రైతుల దేశవ్యాప్త నిరసనకు 12 పార్టీల మద్దతు

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు  బుధవారం చేపట్టబోయే దేశవ్యాప్త నిరసనకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ మేరకు ఆ పార్టీలు ఆదివారం  వెల్లడించాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో తాజా నిరసనకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. రైతులకు మద్దతు తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనపై సోనియా గాంధీ(కాంగ్రెస్‌), హెచ్‌డీ దేవెగౌడ(జేడీఎస్‌), శరత్‌ పవార్‌(ఎన్సీపీ), మమతా బెనర్జీ(టీఎమ్‌సీ), ఉద్ధవ్‌ ఠాక్రే(శివసేన), ఎమ్‌కే స్టాలిన్‌(డీఎమ్‌కే), హేమంత్‌ సొరెన్‌(జేఎమ్‌ఎమ్‌), ఫరూక్‌ అబ్దుల్లా(జేకేపీఏ), అఖిలేశ్‌ యాదవ్‌(ఎస్పీ), తేజస్వి యాదవ్‌(ఆర్జేడీ), డి రాజా(సీపీఐ), సీతారాం ఏచూరి(సీపీఎమ్‌) సంతకాలు చేశారు.    
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని