రైతులకు సంకెళ్లు హేయమైన చర్య:దేవినేని

తాజా వార్తలు

Published : 31/10/2020 01:16 IST

రైతులకు సంకెళ్లు హేయమైన చర్య:దేవినేని

మైలవరం: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి నూజివీడు రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సీఎం జగన్‌ నిరంకుశతీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. రైతుల పోరాటానికి తెదేపా ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని