జేడీయూలో చేరిన బిహార్‌ మాజీ డీజీపీ!

తాజా వార్తలు

Published : 28/09/2020 01:22 IST

జేడీయూలో చేరిన బిహార్‌ మాజీ డీజీపీ!

పట్నా: బిహార్‌లో శాసనసభ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించడంతో పార్టీల్లో చేరికల వాతావరణం మొదలైంది. తాజాగా ఆదివారం బిహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే జేడీయూలో చేరారు. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ నివాసంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గుప్తేశ్వర్‌ మాట్లాడుతూ.. ‘సీఎం స్వయంగా నన్ను పార్టీలో చేరమని అడిగారు. పార్టీ నన్ను ఏం చేయమని కోరినా.. నేను చేసేందుకు సిద్ధం. నాకు రాజకీయాలు అర్థం కావు. అణగారిన వర్గాల కోసమే సమయాన్ని వెచ్చించిన సాధారణ మనిషిని’ అని అన్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసే పోటీ చేయనున్నట్లు ఆయా పార్టీలు ఇదువరకే ప్రకటించాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల కూటమిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

బిహార్‌లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 28న మొదటి దశ, నవంబర్‌ 3,7 తేదీల్లో మిగతా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. కాగా నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలు వెలువరించనుంది. ఈ ఎన్నికలు కొవిడ్‌ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద తొలి ఎన్నికలు కానున్నాయి. 243 నియోజకవర్గాలున్న బిహార్‌లో దాదాపు 7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని