‘గతంలో ఉన్న పథకానికే వైఎస్‌ఆర్‌ బీమా పేరు’

తాజా వార్తలు

Published : 22/10/2020 01:13 IST

‘గతంలో ఉన్న పథకానికే వైఎస్‌ఆర్‌ బీమా పేరు’

ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు

దిల్లీ: ఏపీలో గతంలో ఉన్న పథకానికే వైఎస్‌ఆర్‌ బీమా పేరు పెట్టారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్న ఏ ఒక్క పథకంలోనూ ప్రధాని పేరు రాయడం లేదని ఆయన ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆంగ్లమాధ్యమంలో బోధన జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లో తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చారని.. అమెరికా ఇచ్చిన ప్రాధాన్యం చూసి తెలుగు అభిమానులు గర్వపడాలన్నారు. బీసీల్లో కులానికో కార్పొరేషన్‌ పెట్టి వారి మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మరిచిపోయిన కులాల ప్రస్తావన తెచ్చి మళ్లీ చిచ్చుపెట్టకూడదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని