ఆ దృక్పథంలోనే మార్పు రావాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 28/08/2020 01:04 IST

ఆ దృక్పథంలోనే మార్పు రావాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: భారతీయ జీవిక, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగమే అత్యంత కీలకమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయం లాభదాయకమైనది కాదనే దృక్పథంలో మార్పురావాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గురువారం నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి ఎదగాలి. పరిశ్రమలకు కీలకమైన ముడి సరకును వ్యవసాయ రంగమే అందిస్తోంది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుంటోంది. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం, నాబార్డు వంటి సంస్థలు ప్రణాళిక అమలు చేయాలి’’ అని సూచించారు.

దేశాన్ని పంటకాలనీలుగా విభజించాలి

‘‘దేశంలో 135 కోట్ల మందికి అన్నంపెట్టేది వ్యవసాయదారులే. మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. ఎగుమతి చేసే విధానంపై నాబార్డు అధ్యయనం చేయాలి. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి. పంటల మార్పిడి విధానం పాటించాలి. పంటలు పండించే విధానంతో పాటు మార్కెటింగ్‌ విధానం ఉండాలి. దేశంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాల్సిన  అవసరం ఉంది. రైతులు పెట్టుబడులు తగ్గించుకొని ఆదాయం పెంచుకొనేలా ప్రోత్సహించాలి.  దానికి తగిన భూమికను ప్రభుత్వాలు కల్పించాలి. సామూహిక వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలి’’ అన్నారు. 

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు పెడతాం!

‘‘రైతులే పంటలను ప్రాసెస్‌ చేసి అమ్మేలా యంత్రాలు సమకూర్చాలి. తెలంగాణలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు పెట్టాలని నిర్ణయించాం. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్‌ ప్రాసెజింగ్‌ సెజ్‌లు, యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించాలి. ఆర్థిక చేయూత అందించే పథకాలు, కార్యక్రమాలకు నాబార్డు రూపకల్పన చేయాలి. కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ జరగాలి. డీసీసీబీ బ్యాంకులు సమర్థంగా నడిచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి’’ అని సీఎం ఆదేశించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని