భాజపాలో విలీనమయ్యే ప్రసక్తే లేదు

తాజా వార్తలు

Published : 22/12/2020 01:47 IST

భాజపాలో విలీనమయ్యే ప్రసక్తే లేదు

బెంగళూరు: భారతీయ జనతా పార్టీలో జేడీఎస్‌ను విలీనం చేస్తారని వస్తున్న వార్తలు వదంతులేనని జేడీఎస్‌ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగానీ, ప్రాంతీయ పార్టీలతోగానీ జేడీఎస్‌ విలీనం కాదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తే.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. భాజపా అంతర్గత, రాజకీయ నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం విలీనం లేదా సంకీర్ణం గురించి ఆలోచించడం లేదని తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లు కష్టపడి పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకునేందుకు కృషి చేస్తానని కుమారస్వామి పేర్కొన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని