అక్కడ నుంచి వస్తేనే మాట్లాడుతాం..

తాజా వార్తలు

Published : 04/08/2020 23:54 IST

అక్కడ నుంచి వస్తేనే మాట్లాడుతాం..

దిల్లీ: రాజస్థాన్‌లో అసమ్మతి గళమెత్తిన సచిన్‌ పైలట్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు పార్టీతో చర్చలు జరిపేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. అయితే, హరియాణాలో ఉంటున్న వారు భాజపా ఆశ్రయాన్ని వదిలి వస్తేనే చర్చలని స్పష్టంచేశారు. వారికి ఖట్టర్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు.

‘‘గురుగ్రామ్‌లో అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. అక్కడ పోలీసులు అందుబాటులో లేరు. కానీ, 19 మంది ఎమ్మెల్యేలకు రక్షణగా వెయ్యి మందికి పైగా పోలీసులు కాపలాగా ఉన్నారు. పార్టీతో చర్చలు జరపాలంటే వారు ముందు భాజపాతో దోస్తీని, ఆశ్రయాన్ని, పోలీసుల రక్షణను వదిలి రావాలి. అప్పుడే చర్చలు జరుగుతాయి’’ అని సూర్జేవాలా స్పష్టంచేశారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ కేసులో బిహార్‌ పోలీసుల జోక్యాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ కేసు మహారాష్ట్ర పోలీసుల పరిధిలో అంశమని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని