భాజపాలోకి షహీన్‌బాగ్‌ కాల్పుల నిందితుడు

తాజా వార్తలు

Published : 31/12/2020 01:41 IST

భాజపాలోకి షహీన్‌బాగ్‌ కాల్పుల నిందితుడు

కాసేపటికే పార్టీ నుంచి తొలగింపు

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దిల్లీ ఆందోళనలు జరుగుతున్న సమయంలో తుపాకీతో హల్‌చల్‌ చేసిన కపిల్‌ గుర్జర్‌ భాజపాలో చేరాడు. యూపీలోని ఘజియాబాద్‌లోని పార్టీ నేతల సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకొన్నాడు. హిందుత్వ కోసం పనిచేస్తున్న పార్టీ కావడంతో భాజపాలో చేరినట్లు చెప్పుకొచ్చాడు. అయితే, అతడు పార్టీలో చేరిన కాసేపటికే అతడిని భాజపా తొలగించింది.

సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న కపిల్‌ గుర్జర్‌ పిస్టల్‌తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరి వివాహ వేడుక సమయంలో దిల్లీ వీధుల్లో రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారన్న కారణంతో తాను కాల్పులు జరిపినట్లు విచారణలో  చెప్పుకొచ్చాడు. అలాగే, 2019 నుంచి తన తండ్రి ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఉన్నారని చెప్పారు. అయితే, అతడి కుటుంబం సహా, ఆప్‌ సైతం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది.

ఇవీ చదవండి..
కృష్ణపట్నంలో పారిశ్రామిక కారిడార్‌
2020లో బరితెగించిన పాక్!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని