
తాజా వార్తలు
కూకట్‌పల్లిలో యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షో
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నగరానికి చేరుకున్నారు. భాజపా కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా కూకట్పల్లి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్పల్లి ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి ఆల్విన్ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు మురళీధరరావు, పెద్దిరెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు భాజపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Tags :