అతను సీఎం అయినా ఆశ్చర్యపోను: రౌత్‌

తాజా వార్తలు

Published : 01/11/2020 01:26 IST

అతను సీఎం అయినా ఆశ్చర్యపోను: రౌత్‌

పుణె: బిహార్‌ ఎన్నికలపై శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సీఎం అయినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ మేరకు పుణెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు.

ఎవరి మద్దతూ లేకుండా ఈ ఎన్నికల్లో తేజస్వీ పోరాడుతున్నాడని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు జైల్లో ఉన్నా.. సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలు వెంటాడుతున్నా వెరవక ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుడుతున్నాడని చెప్పారు. రేప్పొద్దున్న అతనిని సీఎంగా చూసినా ఆశ్చర్యపోను అని చెప్పారు. పబ్లిక్‌ సెంటిమెంట్‌ అలా ఉందన్నారు. 

ఉచిత కొవిడ్‌ వ్యాక్సిన్‌ హామీ విషయంలో భాజపాకు భారత ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ‘‘వ్యాక్సిన్‌ హామీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఈసీ భాజపా శాఖలా మారింది. అంతకంటే వారి నుంచి ఏదీ ఆశించలేం’’ అని రౌత్‌ అన్నారు. చైనా సాయంతో జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించాలని ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీగానీ కోరితే వారిని వెంటనే అరెస్ట్‌ చేసి అండమాన్‌ జైల్లో పెట్టాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని