కరోడ్‌పతిలతో పైసాలేని పరంధాముల ఢీ

తాజా వార్తలు

Updated : 27/03/2021 04:42 IST

కరోడ్‌పతిలతో పైసాలేని పరంధాముల ఢీ

గువాహటి: డబ్బు, రాజకీయం.. నేటి సమాజంలో ఈ రెండింటిని వీడదీసి చూడలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరూ పైసా లేకున్నా అసోం ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే వారికి అప్పులే ఎక్కువ. అయినా రాజకీయాల్లో కాకలు తీరిన కరోడ్‌పతిలతో ఢీ కొంటున్నారు. మరి వారెవరు?వారి కథేంటి?

అసోంలోని క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి సలహాదారుడు అఖిల్‌ గొగోయ్‌. ఈ మధ్యే రైజోర్‌ దళ్‌ పార్టీ స్థాపించారు. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తాను స్థాపించిన పార్టీ నుంచే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్‌ నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల అధికారులకు ఆయన సమర్పించిన అఫిడవిట్‌ లెక్కల ప్రకారం.. అతని వద్ద చేతిలో చిల్లి గవ్వ లేదు. ఓ రెండు బ్యాంకుల్లో మాత్రం రూ.60 వేల డిపాజిట్‌ ఉంది. వాటితో పాటు రూ.10 వేల షేర్లు. ఇవి తప్పితే ఎటువంటి స్థిరా, చరా ఆస్తుల్లేవు. పైగా భార్య గీతాశ్రీ తములేకు రూ.50 వేల అప్పు ఉంది. అసోంలోని బీ బొరూహ్‌ కళాశాలలో ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆస్తులు విలువ రూ.1.66 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం శివసాగర్‌లో భాజపా అభ్యర్థి సురభి రాజ్‌ కోన్వర్, కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రమిత్ర గొగోయ్‌తో పాటు అఖిల్‌ల మధ్య ముక్కొణపు పోటీ నెలకొంది.

పైసలేని మరో పరంధాముడే ప్రణబ్‌ డోలె. గోలఘాట్‌ జిల్లాలో కీలకంగా ఉండే జీపాల్‌ క్రిషక్‌ శ్రామిక్‌ నేత. కాంగ్రెస్‌ మహాకూటమిలోని అచాలిక్‌ గణ మోర్చా(ఏజీఎం) తరఫున బోకాఘాట్‌ నుంచి బరిలోకి దిగారు. ఇతని ఆస్తుల విషయానికి వస్తే బ్యాంకుల్లో, చేతిలో కలిపి రూ.45, 675 వేలు ఉన్నాయి. చేసే పని వ్యవసాయం. అదీ రూ.4 లక్షల విలువ గల భూమిలో. అప్పులు రూ.2.53 లక్షలు. తలపండిన నేత ప్రస్తుత అధికార కూటమిలోని ఏజీపీ అధ్యక్షుడు అతోల్‌ బోరాకి డోలే గట్టి పోటీ ఇస్తున్నారు. కాగా, ఈ రెండు నియోజవర్గాల్లో వచ్చే శనివారం పోలింగ్‌ జరగనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని