Rupjyoti Kurmi: రాహుల్‌పై నమ్మకం లేకనే పార్టీని వీడుతున్నా!
close

తాజా వార్తలు

Published : 18/06/2021 17:17 IST

Rupjyoti Kurmi: రాహుల్‌పై నమ్మకం లేకనే పార్టీని వీడుతున్నా!

కాంగ్రెస్‌లో యువతకు చోటులేదు.. అందుకే రాజీనామా చేశా

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి మరోషాక్ తగిలింది. అసాం టీ కమ్యూనిటీకి చెందిన కీలకనేత రూప్‌జ్యోతి కుర్మి గురువారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జూన్ 24-25న భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఆయన మరియానీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

‘టీ కమ్యూనిటీలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే నేను. ఆ కమ్యూనిటీకి చెందిన ఓట్ల పరంగా చూసుకుంటే నేను పార్టీని వీడటం పెద్ద దెబ్బే. అక్కడ శూన్యం ఏర్పడుతుంది. నేను కాంగ్రెస్ కోసం చాలా చేశాను. నేను ఈ పార్టీని చూస్తూ పెరిగాను. ఒక సైనికుడిలా పనిచేశాను. ఇక్కడ దేనికీ విలువ లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా అనిపించిందన్నారు. అలాగే తన నిర్ణయానికి కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీనే కారణమని ఆరోపించారు. ‘ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని తప్పు చేసింది. దానిని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ పార్టీ కొద్దిమంది సీనియర్ల చేతుల్లో ఉంది. యువతకు చోటేలేదు. రాష్ట్రంలోను, కేంద్రలోను ఇదే పరిస్థితి. గాంధీ వారసుడిపై నాకు నమ్మకం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ సన్నిహితుడు జితిన్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో మరో నేత సచిన్ పైలట్ పార్టీని వీడుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పైలట్ వాటిని తోసిపుచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని