కమిటీల పేరుతో మోసం చేస్తోంది: జీవీఎల్‌

తాజా వార్తలు

Published : 09/01/2021 01:06 IST

కమిటీల పేరుతో మోసం చేస్తోంది: జీవీఎల్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందారని, నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రామతీర్థం వెళ్లేందుకు వైకాపా, తెదేపా నాయకులకు లేని ఆంక్షలు భాజపా నాయకులకే ఎందుకని జీవీఎల్‌ ప్రశ్నించారు. భాజపా కన్నెర్రజేస్తే ప్రాంతీయ పార్టీలు కనిపించకుండా పోతాయని హెచ్చరించారు. నిన్న రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రామతీర్థం పర్యటనకు అనుమతి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆక్షేపించారు. ఇప్పటి‌వరకు జరిగిన దాడులకు సంబంధించి ఎంత మందిని అరెస్టు చేశారు? వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

‘‘వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలను మోసం చేసేందకు యత్నిస్తోంది. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడి జరుగుతుంటే, అన్ని‌మతాలకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇతర మతాల పెద్దలు, కమిటీలు ప్రస్తుతం జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించడం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఎందుకు ప్రశ్నించరు? ఆలయాలపై దాడులకు సంబంధించి ఆధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. కమిటీలలో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో 90 ‌శాతం హిందువులు ఉన్నారు. హిందూ ఆలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇతర మతాలకు చెందిన వారు కమిటీలో ఉండి ఏం చేస్తారు? రాష్ట్రంలో అన్యమతాల వారు పరస్పరం దాడులు చేసుకోవడం లేదు.  అందరూ సోదరభావంతో కలిసి జీవిస్తున్నారు’’ అని జీవీఎల్‌ అన్నారు.

ఇవీ చదవండి..
ఆలయాల పునఃనిర్మాణానికి జగన్‌ భూమిపూజ

వినాయక విగ్రహం అపహరణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని