‘రాహుల్‌ ఒక వలసనేత’

తాజా వార్తలు

Updated : 17/02/2021 05:33 IST

‘రాహుల్‌ ఒక వలసనేత’

విమర్శలు గుప్పించిన భాజపా

త్రిసూర్‌: కంచుకోట అయిన అమేఠిలో పరాజయం పాలైన రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారని భాజపా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. రాహుల్‌ ఒక వలసనేత అని ఆయన విమర్శించారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మహిళల ప్రవేశ అంశంపై మంత్రి మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ విషయంపై రాహుల్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన సూచించారు.

కేరళ భాజపా ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉన్న ప్రహ్లాద్‌ జోషి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 21న కేరళలో విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘రాహుల్‌ గాంధీ తన నియోజకవర్గమైన అమేఠీలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అక్కడి ప్రజలు తిరస్కరించడంతో వయనాడ్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే వారికి ఏ అభివృద్ధి జరగదని కేరళ ప్రజలకు తెలుసు.’’ అని ప్రహ్లాద్‌ తెలిపారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం ఇచ్చిన తీర్పును రాహుల్‌ సమర్థించగా, కేరళ కాంగ్రెస్‌ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఈ అంశంపై రాహుల్‌ స్పందించాలని  జోషి సవాలు చేశారు. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే విజయ యాత్రను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభిస్తారని ప్రహ్లాద్‌ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మార్చి7న తిరువనంతపురంలో ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని