ఎన్నికల నిర్వహణకు తొందరెందుకు?: బొత్స

తాజా వార్తలు

Published : 11/01/2021 01:21 IST

ఎన్నికల నిర్వహణకు తొందరెందుకు?: బొత్స

విశాఖ: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఎన్నికలపై విముఖత చూపిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉంటుందని.. అలాంటి ఆయన ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం విజయావకాశాలు వైకాపాకే ఉన్నాయని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై కోర్టులు సైతం ఆలోచించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు. రేపు ‘అమ్మ ఒడి’ ఉందని.. ఈలోగానే ఎన్నికల ప్రకటన ఎవరి లబ్ధి కోసం ప్రకటించారని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల సమస్య ఇప్పుడు లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు నెలరోజులు ఆలస్యమైతే వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈనెల 20 వరకు పొడిగించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ

మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని