పాఠశాల కూల్చివేత దారుణం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 10/06/2021 01:29 IST

పాఠశాల కూల్చివేత దారుణం: చంద్రబాబు

అమరావతి: విశాఖనగరంలో విభిన్న ప్రతిభావంతులకు లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్న హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల కూల్చివేతకు అనుమతించడం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.

 హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2013లో జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకుని 190 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ పాఠశాలలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా ఈనెల 5న పాఠశాల ప్రాంగణాన్ని కూల్చివేసిన అధికారులు 6న స్వాధీనం చేసుకోవటాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యల ద్వారా కలిగే ఆవేదనను మాటల్లో వ్యక్త పరచలేమన్నారు. చట్టం, న్యాయం నిబంధనల్ని పూర్తిగా విస్మరించిన వైకాపా ప్రభుత్వం అధికారంలో కొనసాగే  నైతిక హక్కును కోల్పోయిందని మండిపడ్డారు. నిజమైన సేవా స్ఫూర్తితో సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థలకు గట్టి మద్దతు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని