దిల్లీ రైతులది ‘సత్యాగ్రహం’: రాహుల్‌ గాంధీ

తాజా వార్తలు

Published : 03/01/2021 14:18 IST

దిల్లీ రైతులది ‘సత్యాగ్రహం’: రాహుల్‌ గాంధీ

దేశంలో మరో చంపారన్‌ తరహా ఘటన..

డిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధానిలో కొనసాగుతున్న రైతు నిరసనలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సత్యాగ్రహ ఉద్యమంతో పోల్చారు. దిల్లీ నిరసనల్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ దేశభక్తుడైన సత్యాగ్రహియే అని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు.‌ భారత స్వతంత్ర్య ఉద్యమాన్ని మలుపు తిప్పిన నాటి చంపారన్‌ తరహా సంఘటన.. దేశంలో మరోసారి చోటుచేసుకోనున్నాయని కాంగ్రెస్‌ నేత అభిప్రాయపడ్డారు. నాటి స్వతంత్ర్య సమరంలో బ్రిటిష్‌ కంపెనీకి బలం ఉండగా.. ఇప్పుడు మోదీ మిత్రులైన కంపెనీకి బలం ఉందని ఆయన విమర్శించారు. ఐతే, నేటి ఉద్యమంలో ప్రతి రైతు, రైతుకూలీ కూడా సత్యాగ్రహి అని.. వారు తమ హక్కును పొందే తీరుతారని రాహుల్‌ గాంధీ  అన్నారు.

నామమాత్రపు ప్రతిఫలానికి రైతులు తమ పొలాల్లో నీలిమందు పండిచాలన్న బ్రిటిష్‌ వారి నిర్బధానికి వ్యతిరేకంగా.. బిహార్‌లోని చంపారన్‌ ప్రాంత రైతులు తొలిసారి సత్యాగ్రహం చేశారు. ఈ చారిత్రాత్మక సంఘటన 1917లో మహాత్మాగాంధీ నాయకత్వంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుత వ్యవసాయ చట్టం పంటలను, రైతును సర్వనాశనం చేస్తుందని.. దానిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. దిల్లీ రైతు నిరసనలకు ఈ పార్టీ తమ పూర్తి మద్దతు ప్రకటించింది. రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఈ ఆందోళన నేటితో 39వ రోజుకు చేరింది. జనవరి నాలుగో తేదీ, సోమవారం రైతులు-కేంద్రం మధ్య ఏడో దఫా చర్చలు జరగనున్నాయి.

ఇవీ చదవండి..

చలి, వర్షం లెక్కచేయని రైతన్న..

జనవరి 26న రాజ్‌పథ్‌లో కవాతు చేస్తాం..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని