ఉద్ధవ్‌కు ముంచుకొస్తున్న గడువు

తాజా వార్తలు

Published : 10/04/2020 01:26 IST

ఉద్ధవ్‌కు ముంచుకొస్తున్న గడువు

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేని ఎమ్మెల్సీగా నియమించాలని అక్కడి ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించాలని కోరింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధవ్‌ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌ నేతృత్వంలో మహా అఘాడీ ప్రభుత్వం నవంబర్‌లో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కూటమి తరఫున సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ వాయిదా పడ్డాయి. దీంతో ఎమ్మెల్సీగా నియమించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభిస్తోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 1100 దాటింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని