చంద్రబాబుకు జైళ్ల శాఖ అనుమతి నిరాకరణ

తాజా వార్తలు

Published : 13/06/2020 14:43 IST

చంద్రబాబుకు జైళ్ల శాఖ అనుమతి నిరాకరణ

అమరావతి: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఇవాళ హైదరాబాద్‌ నుంచి అమరావతి బయలుదేరి వెళ్లిన చంద్రబాబు అక్కడనుంచి గుంటూరు వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరారు. కరోనా నిబంధనల ప్రకారం అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని అధికారులు వారికి తెలియజేశారు. అచ్చెన్నాయుడిని కలిసి పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ని చంద్రబాబు కోరారు. ఆయన స్పందిస్తూ మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని సూచించారు.

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. అనారోగ్యం దృష్ట్యా ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని