Lockdown: హైకోర్టు ఒత్తిడితోనే..: భట్టి
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: హైకోర్టు ఒత్తిడితోనే..: భట్టి

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా వైద్యానికి ధ‌ర‌లు నిర్ణ‌యించమ‌ని హైకోర్టు ఆదేశించినా ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సీఎం దీనిపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఆ టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియ‌డం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. భట్టి విక్రమార్క జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వ‌హించారు. క‌రోనా ఉద్ధృతిపై సీఎస్‌కు ఫోన్ చేసి అప్ర‌మ‌త్తం చేయ‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌యోజనం లేద‌ని సీఎస్ అన్నార‌ని.. హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నార‌న్నారు. 
క‌రోనా క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌జ‌లను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయ‌ని భట్టి విక్ర‌మార్క విమర్శించారు. వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం మాట్లాడిన త‌ర్వాత నుంచి వ్యాక్సినేష‌న్ పూర్తిగా ఆగిపోయింద‌ని ఆక్షేపించారు. ఐసోలేష‌న్ కేంద్రాలు పెంచి.. పాల‌న‌ను వికేంద్రీక‌ర‌ణ చేయాల‌న్నారు. తెలంగాణ‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించి.. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేపట్టాల‌ని డిమాండ్‌ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప‌రిపాల‌న‌పై దృష్టి సారిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు భ‌ట్టి చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని