సీఎం కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు! 

తాజా వార్తలు

Updated : 19/07/2021 14:53 IST

సీఎం కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు! 

రేవంత్‌ హౌస్‌ అరెస్టును ఖండించిన మాణికం ఠాగూర్‌

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్నారని, ప్రతిపక్ష పార్టీ హక్కులను తెరాస కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్‌ అక్రమ నిర్బంధాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 

మరోవైపు, పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు రేవంత్‌ లేఖ రాశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ ఉదయం రేవంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని