విశాఖ స్టీల్‌పై సుబ్రహ్మణ్యస్వామి ఏమన్నారంటే?

తాజా వార్తలు

Updated : 11/03/2021 14:04 IST

విశాఖ స్టీల్‌పై సుబ్రహ్మణ్యస్వామి ఏమన్నారంటే?

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని.. దీన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణను తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు.

ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడం సరికాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రతిదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని.. బలమైన కారణాలుంటేనే అలా చేయాలన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? లేదా? అనేదాన్ని కేస్‌ బై కేస్‌ చూడాలని వ్యాఖ్యానించారు. తితిదేను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలన్నారు. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్న సీఎం జగన్‌ నిర్ణయం బాగుందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. తితిదేను భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలన్నారు. పెట్రో ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని