మా లక్ష్యం నెరవేరింది: చిరాగ్

తాజా వార్తలు

Published : 12/11/2020 01:37 IST

మా లక్ష్యం నెరవేరింది: చిరాగ్


పట్నా: 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ). కానీ.. ఆ పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్‌ మాత్రం తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందని అంటున్నారు. 

‘మిగతా పార్టీల వలే..మా పార్టీ కూడా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు పొందాలని కోరుకున్నాను. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో భాజపాను అతిపెద్ద పార్టీగా నిలపబడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. మేము చూపిన ప్రభావంపై సంతోషంగా ఉన్నాం’ అంటూ చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార కూటమి నుంచి బయటకు వచ్చిన ఎల్‌జేపీ..జేడీయూపై విమర్శలు చేస్తూ, భాజపాకు మద్దతు ప్రకటిస్తూ తన ప్రచారపర్వాన్ని కొనసాగించింది. అలాగే జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆ పార్టీ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. దాంతో ఓట్లు చీలడంతో నితీశ్ పార్టీకి సీట్ల సంఖ్య తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. 20 స్థానాల్లో జేడీయూ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని భాజపా నేత సుశీల్‌ కుమార్ మోదీ కూడా అంగీకరించడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని