Pawan Kalyan: కర్నూలు జిల్లాకు ఆ మహామనిషి పేరు పెట్టండి.. పవన్‌ డిమాండ్‌

తాజా వార్తలు

Updated : 22/10/2021 17:52 IST

Pawan Kalyan: కర్నూలు జిల్లాకు ఆ మహామనిషి పేరు పెట్టండి.. పవన్‌ డిమాండ్‌

అమరావతి: అణగారిన వర్గాల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక హక్కుగా తాము ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తర్వాత జనసేన పార్టీయే జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా పేరు మారుస్తుందన్నారు. అందుకు తాము కట్టుబడి ఉంటామని పవన్‌ స్పష్టంచేశారు. అంతకముందు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని, కనీసం ఈ ప్రభుత్వమైనా చేసి ఆ మహామనిషికి గౌరవం ఇవ్వాలని కోరారు. కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అని మార్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని