devineni uma: ‘దేవినేనిపై దాడులను పోలీసులే ప్రోత్సహించారు’..!

తాజా వార్తలు

Updated : 28/07/2021 14:13 IST

devineni uma: ‘దేవినేనిపై దాడులను పోలీసులే ప్రోత్సహించారు’..!

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా నేత దేవినేని ఉమపై పోలీసులే దగ్గరుండి భౌతిక దాడులు చేయించారని ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగే మార్గం వైపు దేవినేనిని మళ్లించారన్నారు. ఈ విషయం తెలియక పోలీసులు చెప్పిన మార్గంలో వెళ్లినందుకే ఆయన దాడికి గురయ్యారని చెప్పారు. ఏపీలో రక్షకులే భక్షకులైన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేనిని ఫిర్యాదు చేయనీయకుండా ఎదురు కేసు పెడతారా..? అని  ధూళిపాళ్ల నిలదీశారు.     

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న అర్ధరాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు చోట్ల ఆందోళనలకు దిగారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని