close

తాజా వార్తలు

Updated : 26/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుప్పంలో ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న గుడుపల్లె, కుప్పం మండలాల కార్యకర్తల సమావేశం అనంతరం రాత్రి కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేసిన చంద్రబాబు ఇవాళ ఉదయం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. 

మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తిరుపతి, చిత్తూరు తెదేపా పార్లమెంటరీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నాయకులతో చర్చించారు. మధ్యాహ్నం శాంతిపురం మండలంలో పర్యటించనున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారి నుంచి చంద్రబాబు వినతిపత్రాలు స్వీకరించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని