Bandi Sanjay: సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమా?: సంజయ్‌

తాజా వార్తలు

Published : 12/09/2021 12:05 IST

Bandi Sanjay: సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమా?: సంజయ్‌

మెదక్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెరాసకు సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 16వ రోజు కొనసాగుతోంది. మెదక్‌ జిల్లాలో యాత్ర సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..భాజపాను ఆదరిస్తున్నారని వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. కేంద్రం నుంచే తీసుకొస్తామని సంజయ్‌ చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. ఈ నెల 17న పాదయాత్రలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారని బండి సంజయ్‌ చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని