KCR-Amit Shah: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రికి కేసీఆర్‌ విజ్ఞప్తి

తాజా వార్తలు

Updated : 04/09/2021 18:34 IST

KCR-Amit Shah: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రికి కేసీఆర్‌ విజ్ఞప్తి

దిల్లీ: దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని కోరారు.  గతంలో ఉన్న 9 పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీసు కమిషనరేట్లు రెండు నుంచి తొమ్మిదికి, నాలుగు పోలీసు జోన్లు ఏడుకి పెరిగాయని హోం మంత్రికి వివరించారు. పోలీసు మల్టీ జోన్లు రెండు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు.  ఎస్పీలు, కమిషనర్లు, జోన్‌ ఐజీల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు. సీనియర్‌ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. నిన్న  సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్‌.. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ కీలక భేటీలో పలు అంశాలపై 10 లేఖలను ప్రధానికి అందజేసిన విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని