జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ అడ్డగింత.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 28/07/2021 12:44 IST

జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ అడ్డగింత.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

 హైదరాబాద్‌: మునుగోడులో జరుగుతున్న రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి వాహనశ్రేణిని మునుగోడు చౌరస్తాలో కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి రాకుండా అవుటర్ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని బొంగులూరు గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేయడంతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలను గృహనిర్బంధం చేయడంపై రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడానికే దళితబంధు పథకం తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని